Bed Seats Allotment: రాష్ట్రంలో బీఈడీ కన్వీనర్ కోటాలో మొదటి విడతలో 10,216 సీట్లు కేటాయించగా.. మరో 4 వేల 248 మిగిలాయి. ఈ ఏడాది బీఈడీ కోర్సులో కన్వీనర్ కోటాలో 14,464 సీట్లు అందుబాటులో ఉండగా.. 33,683 మంది ఎడ్‌సెట్‌లో అర్హత సాధించారు.
B.ed Seats Allotment: బీఈడీ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి.. తరగతులు ఎప్పుడంటే?
B.ed Seats Allotment:రాష్ట్రంలో బీఈడీ కన్వీనర్ కోటా మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తైంది. మొదటి విడతలో 10,216 సీట్లను కేటాయించారు. ఈ ఏడాది బీఈడీ కోర్సులో కన్వీనర్ కోటాలో 14,464 సీట్లు అందుబాటులో ఉండగా.. 33,683 మంది అభ్యర్థులు ఎడ్‌సెట్‌లో అర్హత సాధించారు.
బీఈడీ కన్వీనర్ కోటా మొదటి విడత సీట్ల కేటాయింపు
first phase allotment: అయితే కేవలం 17 వేల 417 మంది అభ్యర్థులు మాత్రమే బీఈడీలో చేరేందుకు మొదటి విడతలో వెబ్ ఆప్షన్లు సమర్పించారు. మొదట విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 27 నుంచి 30 వరకు కాలేజీలో చేరాలని కన్వీనర్ తెలిపారు. ఈనెల 30 నుంచి బీఈడీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
- ఇదీ చూడండి:
- బీబీఏ పట్టభద్రులకు కూడా బీఈడీ చేసే అవకాశం