Bandi sanjay on micro donations: ముందు దేశం, తరువాత పార్టీ, ఆ తరువాతే కుటుంబమని అదే భాజపా సిద్ధాంతామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ప్రతి ఒక్కరూ భారతీయుడునని, హిందువునని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని తెలిపారు. అనేక సవాళ్లను స్వీకరించి అధిగమించడమే భాజపా కార్యకర్తల నైజమని అన్నారు. రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని... అదే స్పూర్తితో సూక్ష్మ విరాళాల సేకరణ లోనూ అగ్రభాగాన నిలపాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
అందరి భాగస్వామ్యం ఉండాలి
భాజపా నాయకులతో బండి సంజయ్ మైక్రో డొనేషన్స్ పై వర్చువల్ సమావేశం నిర్వహించారు. మైక్రో డొనేషన్స్ జాతీయ ఇంఛార్జ్ సునీల్ దేవధర్, దక్షిణాది విభాగం ఇంఛార్జ్ నిర్మల్ సురానా, రాష్ట్ర ఇంఛార్జ్ చింతల రామచంద్రా రెడ్డి, సహ ఇంఛార్జ్లు బండారు శాంతి కుమార్, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రో డోనేషన్స్ ఆవశ్యకత, ఉద్దేశాలను బండి సంజయ్ వివరించారు. కొన్ని రాజకీయ పార్టీల మాదిరిగా బ్లాక్ మెయిల్ చేసి, అవినీతికి పాల్పడి నిధులు సమీకరించాల్సిన అవసరం భాజపాకు లేదన్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు.