తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Police SI 2023 : త్వరలోనే ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఎంపికల జాబితా వెల్లడి!

Telangana SI Merit List 2023 : ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తును ముమ్మరం చేసింది. కటాఫ్‌ మార్కుల ఆధారంగా.. తుది ఎంపిక జాబితాను సిద్ధం చేస్తారు. ఎస్సైల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా.. ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్‌ మార్కులను నిర్ణయిస్తున్నారు.

Telangana Police SI Selection 2023
Telangana Police SI Selection 2023

By

Published : Jul 6, 2023, 5:48 PM IST

Telangana Constable Merit List 2023 : రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సమయం ఆసన్నమైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) కసరత్తును ముమ్మరం చేసింది. తుది రాత పరీక్షలో ఎంపికైన వారిలో నుంచి మొత్తం 97,175 మంది అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే వారిలో నుంచే కటాఫ్‌ మార్కుల ఆధారంగా.. తుది ఎంపిక జాబితాను తయారు చేస్తారు. ఎస్సైల ఎంపికకు మల్టీ జోన్లలోని పోస్టుల ఖాళీల ఆధారంగా.. ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపికకు జిల్లాల్లోని ఖాళీలకు అనుగుణంగా కటాఫ్‌ మార్కుల్ని నిర్ణయిస్తున్నారు.

SI Selection Process in Telangana : సామాజిక వర్గాల వారీగా, పురుషులు, మహిళలు, ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్‌ పాయింట్లు.. ఇలా దాదాపు 180కి పైగా అంశాలను పరిగణనలోకి తీసుకొని కటాఫ్‌ మార్కుల్ని నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకషంగా వాటిని పరిశీలిస్తున్నారు. ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. అనుకున్నట్లుగా అంతా సవ్యంగా సాగితే ఈ నెల రెండో వారంలో జాబితా వెలువడే అవకాశముంది.

అయితే.. మొదట ఎస్సైలుగా ఎంపికైన 579, ఏఎస్సైలుగా ఎంపికైన 8 మంది జాబితాలను వెల్లడించాలని నిర్ణయించారు. ఇది అలా ఉండగా.. ప్రస్తుతం తుది రాతపరీక్షలో ఎంపికైన 97,175 మందిలో పలువురు ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు. తొలుత ఎస్సై విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్‌లాగ్‌లను నివారించవచ్చనేది నియామక మండలి ఆలోచన చేస్తోంది. ఎస్సైగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్‌ పోస్టును వదులుకుంటామని అండర్‌టేకింగ్‌ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్‌ పోస్టు స్థానంలో మరొకరు ఎంపిక చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

నేపథ్యం పరిశీలన అనంతరమే ఉద్యోగపత్రం :తుది ఎంపిక జాబితాలో పేరున్నా గానీ, అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం మాత్రం ఉండదు. ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన నేపథ్యం, ప్రవర్తన, నేరచరిత్ర.. తదితర అంశాలను వారు క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్‌బీ) చేపట్టనుంది. క్రిమినల్‌ అండ్‌ క్రైమ్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిశీలనపైనా కూడా ఎస్‌బీ దృష్టి సారించనుంది. విజేతల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి పోలీస్​ స్టేషన్లలో ఏమైనా కేసులున్నాయా..? అని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన నివేదికను మండలికి పంపనున్నారు. ఆ నివేదికలో క్లీన్‌చిట్‌ లభిస్తేనే ఆ తర్వాత ఉద్యోగపత్రం అందుకుంటారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details