తెలంగాణ

telangana

ETV Bharat / state

మొదటి రోజు 8,065 మంది ఎంసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన - ఎంసెట్​ 2020 ధ్రువపత్రాల పరిశీలన తాజా వార్త

కరోనా జాగ్రత్తల నడుమ ఎంసెట్​ ధ్రువపత్రాల పరిశీలన నేటి నుంచి ప్రారంభమైంది. ఈనెల 20 వరకు సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ కొనసాగనుంది. తగిన విభాగాల్లో 22న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు.

eamcet
eamcet

By

Published : Oct 12, 2020, 10:42 PM IST

కరోనా నివారణ జాగ్రత్తలతో ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన సోమవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 సహాయ కేంద్రాల్ల ఈనెల 20 వరకు కొనసాగనుంది. మొదటి రోజు 8,065 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అరగంటకు ఆరుగురు చొప్పున స్లాట్లు కేటాయిస్తున్నారు.

థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి పంపిస్తున్నారు. కేంద్రాల్లో శానిటైజర్లు, భౌతిక దూరం కోసం హాళ్లో సర్కిళ్లు ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇప్పటి వరకు 43,031 మంది స్లాట్లు బుకింగ్ చేసుకున్నారు. ఈనెల 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఇచ్చి.. ఈ నెల 22న సీట్లు కేటాయించనున్నారు.

ఇదీ చూడండి:రెండు నెలలకోసారి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలి: హరీశ్

ABOUT THE AUTHOR

...view details