కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై మొదటి రోజు ఉన్నతస్థాయి కమిటీ విచారణ పూర్తయ్యింది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో విచారణ జరిగింది. రాంకృపాల్తో పాటు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి పాల్గొన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగింది.
కాచిగూడ రైళ్ల ప్రమాదంపై మొదటి రోజు విచారణ పూర్తి - కాచిగూడ రైళ్ల ప్రమాదంపై విచారణ
విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో కాచిగూడ రైళ్ల ప్రమాదంపై మొదటి రోజు విచారణ పూర్తయింది. రేపు రెండో రోజు విచారణ జరగనుంది.

ఆరు మంది ప్రయాణికులను ప్రమాద సమయంలో వారు చూసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ రైల్వే స్టేషన్లోకి వెళ్లి ఎంఎంటీఎస్ ఏ ప్లాట్ ఫారం నుంచి బయలుదేరింది... తదితర వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరినప్పుడు సీసీ పుటేజీ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసుకుని.. రైళ్ల ఆపరేషన్స్ వివరాలు కనుక్కున్నారు. అనంతరం ప్రమాదంలో దెబ్బతిన్న కోచ్‌లను పరిశీలించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రేపు రెండవ రోజు విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ