రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒక్క నిమిషం నిబంధన కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు గంట ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. వారి సాయంగా పలువురు తల్లిదండ్రులు వచ్చారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ఇంటర్ బోర్డు పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.
పాతబస్తీ, ఫలక్‌నూమ, చంద్రాయణగుట్ట, జహ్నుమ, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని కళాశాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు పటిష్ఠ ఏర్పాటుచేశారు. సుమారు గంట ముందే విద్యార్థులంతా కేంద్రానికి చేరుకున్నారు. మెహదీపట్నంలో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.