పురపాలక ఎన్నికలకు సంబంధించి తొలిరోజు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 967 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 117 దాఖలు కాగా.. 94 నామినేషన్లతో పెద్దపల్లి తరువాతి స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో 84, జగిత్యాల జిల్లాలో 71 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు పార్టీల అభ్యర్థులుగా కూడా వార్డులకు నామినేషన్లు వేశారు. శుక్రవారం వరకు ఇందుకు అవకాశం ఉంది.
వివిధ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను గురువారం ముగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మెదక్ పురపాలక సంఘంలో ఓ వార్డుకు సంబంధించి తన భార్యకు కాకుండా మరో పార్టీ నుంచి తెరాసలో చేరిన మరొకరికి టికెట్ కేటాయించడంతో మనస్తాపానికి గురైన గోదల కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.