జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొలిరోజు 17 మంది నామినేషన్లు - జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లు
17:58 November 18
జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొలిరోజు 17 మంది నామినేషన్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదటి రోజు 17 మంది 20 నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస నుంచి ఆరు నామినేషన్లు, తెదేపా నుంచి ఐదు, భాజపా నుంచి రెండు, కాంగ్రెస్ నుంచి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్, ముగ్గురు ఇండిపెండింట్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక మిగిలింది రెండు రోజలు మాత్రమే. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. రేపు, ఎల్లుండి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి :గ్రేటర్ పోరు.. కొద్దిసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన