సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ తొలి బోనం సమర్పించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలి బోనాన్ని పండితులకు అందజేశారు. ప్రతి సంవత్సరం మంత్రి ఇంటి నుంచే అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం - మహంకాళి అమ్మవారికి తొలిబోనం వార్తలు
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం అందింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ తొలిబోనాన్ని సమర్పించారు.
మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం
ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే అమ్మవారి ఉత్సవాలు కరోనా నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా జరుగుతున్నాయి. భక్తులు లేకుండానే అమ్మవారికి పూజా కార్యక్రమాలు, బోనాల సమర్పణ ఉంటుందని ఆలయ పండితులు తెలిపారు.
Last Updated : Jul 12, 2020, 10:23 AM IST