రెండోసారి సీఎం అయిన తరువాత కేసీఆర్ తన పేరు చిరకాలం ఉండాలని సచివాలయం కూల్చివేసి...కొత్త నిర్మాణం చేపడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. కేసీఆర్ నిర్ణయాలకు ఎంఐఎం మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఆయన సూచించారు. అమరావతి మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సచివాలయం కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ నిరుపేద ప్రజల పెళ్లిళ్లకు ఫంక్షన్ హల్‌గా, శాసనమండలిని గ్రంథాలయంగా మారుస్తామని తెలిపారు. రెండు పడక గదుల నిర్మాణం, ఉద్యోగాల కల్పన, హైదరాబాద్‌ను డల్లాస్ నగరంగా మార్పు... దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిన తరువాత కొత్త భవనాలను కట్టాల్సిందిగా కేసీఆర్‌కు వీహెచ్ సూచించారు.
'ముందు హామీలు అమలు చేయాలి... తర్వాతే నిర్మాణాలు' - TRS
కొత్తగా సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలను నిర్మించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్యగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఆరోపించారు. ఎర్రమంజిల్‌లోని నూతన అసెంబ్లీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
VH
Last Updated : Jul 2, 2019, 6:08 PM IST