Firing in Central Superfast Express at Maharashtra : మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపుర్-ముంబయి సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్‌లోని నాంపల్లిలో నివాసం ఉంటున్న సయ్యద్ సఫియుల్లా మృతి చెందాడు. అతను ముగ్గురు పిల్లలు, తన భార్యతో అజ్మీర్ నుంచి ముంబయి మీదుగా హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని స్వస్థలమైన బీదర్‌కి తరలించనున్నారని పోలీసులు తెలిపారు. కోఠి దగ్గర సయ్యద్ గుజరాత్ గల్లీలోని ఓ మొబైల్ షాపులో ఉద్యోగిగా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు... స్థానిక నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్... మృతి చెందిన సయ్యద్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. సయ్యద్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.
రైలులో కాల్పులు జరిగిన ఘటన సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ తన పై అధికారిపై ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అధికారితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. అనంతరం నిందితుడ్ని అధికారులు అదుపులోకి తీసుకుని.. అతని దగ్గర ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అసలు ఏమి జరిగిందంటే.. : మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపుర్-ముంబయి సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు ఉదయం 5 గంటల తరవాత ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ ఒకడు తన పై అధికారిపై ఏకే-47 తుపాకీతో కాల్పులు చేశాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ఈ కాల్పల్లో అధకారి మృతి చెందాదడు. అతను రాజస్థాన్‌కి చెందిన టికా రాం మీనాగా అధికారులు గుర్తించారు. అనంతరం ఆ కానిస్టేబుల్ బీ5, ఎస్6 బోగీలు సహా వాటి మధ్యలో ప్యాంట్రీ కార్లోనూ ఒక్కో ప్రయాణికుడి చొప్పున కాల్పులు చేసి చంపాడు.
MP Asaduddin Owaisi Tweet on Gun Firing Incident: కాల్పులు అనంతరం ప్రయాణికులు రైలు చైను లాగారు. అప్పుడు నిందితుడు రైలు నుంచి దూకి తప్పించుకున్న సమయంలో గవర్నమెంట్ ర్వైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడ్ని నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చేతన్ సింగ్(34)గా అధికారులు గుర్తించి.. స్థానిక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.
ఈ రైలులో జరిగిన ఘటన ఉగ్రదాడి అని అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఘటనపై స్పందించి ట్వీట్ చేశారు. దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా నిరంతరం చేస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలు, దాడులకు బీజేపీ మద్దతుదారులు రెచ్చగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి :