బంజారాహిల్స్ ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది. రోడ్డు నెంబర్ 14లోని రేంజ్ రోవర్ కారులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా ప్రమాదం జరగడం వల్ల స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చూస్తుండగానే మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సాంకేతిక లోపం వల్లనే మంటలు చెలరేగాయా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న కారులో మంటలు... తప్పిన ప్రమాదం - hyderabad
ఆగి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన బంజరాహిల్స్ లో చోటుచేసుకుంది.కారులో ఎవరూ లేనందున ప్రమాదం తప్పింది.
![ఆగి ఉన్న కారులో మంటలు... తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3793684-187-3793684-1562687114649.jpg)
ఆగి ఉన్న కారులో మంటలు