తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ - The fire department conducted a mock drill at the Government Maternity Hospital in Kothi.

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించింది. ప్రమాదాలు జరిగినప్పుడు ఏవిధంగా స్పందించాలనే విషయాలపై సిబ్బంది అవగాహన కల్పించారు.

ఆసుపత్రి లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్

By

Published : Nov 22, 2019, 7:22 PM IST

హైదరాబాద్​ కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ చేపట్టింది. ప్రమాదం జరిగినపుడు ఏ విధంగా స్పందించాలనే విషయాలపై ఆస్పత్రి డాక్టర్లు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి అధికారులు వివరించారు.

మంటలు వ్యాప్తి చెందుతున్నప్పుడు వాటిని అదుపు చేయడం, ఆసుపత్రిలో ఉన్న రోగులను ఏవిధంగా కాపాడాలి అనే అంశాలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించింది. అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని అందుకోసమే ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అగ్ని మాపక అధికారులు వెల్లడించారు.

ఆసుపత్రి లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్

ఇదీ చూడండి : 'జార్జ్​రెడ్డి స్ఫూర్తితో ఉద్యమంలో మరింత ముందుకు'

ABOUT THE AUTHOR

...view details