తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో టపాసుల నిషేధంపై సుప్రీంలో విచారణ ప్రారంభం - High Court latest news

రాష్ట్రంలో టపాసుల నిషేధంపై సుప్రీంలో విచారణ
రాష్ట్రంలో టపాసుల నిషేధంపై సుప్రీంలో విచారణ

By

Published : Nov 13, 2020, 12:20 PM IST

Updated : Nov 13, 2020, 3:08 PM IST

08:22 November 13

రాష్ట్రంలో టపాసుల నిషేధంపై సుప్రీంలో విచారణ ప్రారంభం

దీపావళి పండుగ సందర్భంగా టపాసులను నిషేధిస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరిన ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోషియేషన్... ఆ పిటిషన్​లో కోరింది.  ఇప్పటికే భారీగా బాణసంచా కొనుగోలు చేశామన్న డీలర్స్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. జస్టిస్ ఖాన్ విల్కర్ ధర్మాసనం దీనిపై విచారణ ప్రారంభించింది. 

దీపావళి సందర్భంగా టపాసుల కొనుగోలుకు కోట్లాది రూపాయలు వెచ్చించామని, ఆ వ్యాపారంపై వేలాది మంది ఆధారపడ్డారని అందులో పేర్కొన్నారు. ఈ సీజన్​లో వాటి అమ్మకాలపైనే వారి ఆధారపడ్డారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై తీవ్ర ఆర్దిక ప్రభావం చూపనుందని, నష్టాలపాలై రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి తమను ఆదుకోవాలని కోరారు. 

మరోవైపు దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం గురువారం సానుకూలంగా స్పందించి... టపాసుల అమ్మకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇప్పటి వరకు తెరిచిన షాపులను మూసి వేయించాలని ఉత్తర్వులిచ్చింది. తెలంగాణాలోనూ ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని, కొనడం గాని చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని కోరింది. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ఈ నెల 19న నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Last Updated : Nov 13, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details