RTC BUS FIRE: ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు స్టీరింగ్ వద్ద మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి రోడ్డు పక్కనే బస్సును నిలిపేశారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని లాలాపేట్ ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకుంది.
RTC BUS FIRE: ఆర్టీసీ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు - బస్సు డ్రైవర్ చాకచక్యం
RTC BUS FIRE: బస్సు డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లో జరిగింది.
ఆర్టీసీ బస్సులో మంటలు
రాణిగంజ్-2 డీపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రమాద సమయంలో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులు అందరినీ దించేశారు. అనంతరం నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై పక్కనే బస్సు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
- ఇదీ చూడండి:
- ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి
Last Updated : Feb 22, 2022, 7:45 PM IST