రెండు రోజుల క్రితం ప్రమాదానికి గురైన భారత్‌కు చెందిన ఓ చముర నౌకలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు గల్ఫ్ నుంచి క్రూడాయిల్ తీసుకువచ్చే నౌక ప్రమాదం బారిన పడింది. ఎమ్టీ న్యూ డైమండ్ అనే నౌక భారీ చమురు నిల్వలతో శ్రీలంక మీదుగా భారత్ వస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలంక తీరంలో మూడో తేదీన ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కోస్ట్‌గార్డు.... భారత్ నౌకా దళ యుద్ధ నౌక సహ్యాద్రిని పంపించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి నౌకలోని మంటలు పూర్తి ఆరిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. అయితే ఆ నౌక ప్రయాణానికి అనువుగా ఉందా లేదా అన్నది పరిశీలించిన తర్వాత నిర్దరించానున్నారు.