హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో 5కె సైకిల్థాన్ నిర్వహించారు. అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని జెండా ఊపి సైకిల్థాన్ ప్రారంభించారు. ఈ ఫైర్ రైడ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు వెల్లడించారు. 1944 ఏప్రిల్ 14న ముంబయి విక్టోరియా డాక్ యార్డు నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది మృతి చెందిన ఘటనకు చిహ్నంగా... ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా వారోత్సావాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది: హోంమంత్రి - అగ్నిమాపక శాఖ వారోత్సవాలు
అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా నుంచి 5కె సైకిల్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని... కేసీఆర్ చొరవతో ప్రతి మండలానికి ఇప్పుడు ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉందని తెలిపారు.
ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది: హోంమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారని హోంమంత్రి మహమూద్ అలీ గుర్తుచేశారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి నివాళులు అర్పించారు. సిబ్బంది పనితీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు, రైడర్స్, అగ్నిమాపక విభాగం డీజీ సంజయ్ కుమార్ జైన్ పాల్గొన్నారు.