బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు... 8మందికి గాయాలు - సామర్లకోటలో పేలుడు-ముగ్గురి పరిస్థితి విషమం
ఏపీ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం జీ మేడపాడులో పేలుడు కలకలం రేపింది. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనంలో 8మంది గాయపడ్డారు. వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత సాగో ఫ్యాక్టరీలో ఉన్న ఇందిరా ఫైర్ వర్క్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా... వారి పేర్లు చిల్లి వీర రాఘవ(40), కొయ్య లక్ష్మి (50) బొబ్బర ధనలక్ష్మి (40). ఇద్దర్ని ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు... 8మందికి గాయాలు