తెలంగాణ

telangana

ETV Bharat / state

ఛత్రినాక పోలీస్​ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం - fire accident at chatrinaka

భాగ్యనగరంలోని ఛత్రినాక పోలీస్​ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. చెత్త గోదాంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Fire at near chatrinaka Police Station at hyderabad
ఛత్రినాక పోలీస్​ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

By

Published : Jan 5, 2020, 9:22 AM IST

హైదరాబాద్ ఛత్రినాక పోలీస్​ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున చెత్త గోదాంలో మంటలు చెలరేగడం వల్ల స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

ఏలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగనప్పటికీ గోదాంలో ఉన్న చెత్త అగ్నికి పూర్తిగా దగ్ధం అయ్యింది. సిగరేటు తాగి ఎవరైనా విసిరివేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

ఛత్రినాక పోలీస్​ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి : కొండాపూర్​లో 'ఈనాడు మెగా ప్రాపర్టీ షో'

ABOUT THE AUTHOR

...view details