నగరంలోని అబిడ్స్‌లో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న చెత్తలో మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలానికి దగ్గరలోనే ఫోటో గ్యాలరీ, రికార్డు రూములు ఉన్నాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
పురావస్తుశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం... సిబ్బంది అప్రమత్తం - హైదరాబాద్ తాజా సమాచారం
హైదరాబాద్ అబిడ్స్‌లోని రాష్ట్ర పురావస్తుశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం వెనుక భాగంలో ఉన్న చెత్తకుప్పల్లో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తం కావడంతో అపాయం తప్పింది.
పురావస్తుశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం...సిబ్బంది అప్రమత్తం
మంటలు కార్యాలయానికి వ్యాపించకుండా సకాలంలో స్పందించి అదుపులోకి తీసుకొచ్చారు. సిగరెట్ తాగి చెత్తలో వేయడం వల్లనే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.