తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగవేళ పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు - అనంతపురం జిల్లా నేర వార్తలు

AP Fire Accidents: దీపావళి పండుగవేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదంతో 25 బైకులు, సామగ్రి కాలి బూడిదయ్యాయి. కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ అగ్నిప్రమాదాలు సంభవించాయి.

Fire Accidents in AP
Fire Accidents in AP

By

Published : Oct 25, 2022, 10:00 AM IST

AP Fire Accidents: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని మెకానిక్​ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు మెకానిక్ షెడ్​కునిప్పు పెట్టడంతో 25 ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.45 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. స్పేర్ పార్ట్స్ మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాకినాడ జిల్లా: పెద్దాపురం పద్మనాభం కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. సామర్లకోటలో పాత ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద బాణసంచా కాల్చుతుండగా తారాజువ్వలు పడి పూరిల్లు దగ్ధమైంది.

తూర్పుగోదావరి జిల్లా: అనపర్తి మండలం పులగుర్తలో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా:గుంటూరులోని పాలీమర్ ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలను సిబ్బంది అదుపు చేశారు.

Fire Accidents in AP

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details