జీడిమెట్ల పారిశ్రామికవాడలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అగ్నిప్రమాదం
By
Published : Feb 3, 2019, 5:10 PM IST
అగ్నిప్రమాదం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నాలుగు కెమికల్ డ్రమ్ములకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఎటువంటి అపాయం జరగలేదు. అక్కడికి కెమికల్ డ్రమ్ములు ఎలా వచ్చాయా అని అధికారులు ఆరా తీస్తున్నారు.