తెలంగాణ

telangana

ETV Bharat / state

fire accident: గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం.. గుర్తించడంతో తప్పిన ముప్పు

fire accident: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగో అంతస్తులో ఉన్న ఎలక్ట్రిక్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident
గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం

By

Published : Apr 5, 2022, 3:07 PM IST

fire accident: గాంధీ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని నాలుగో అంతస్తులో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలు అదుపులోకి రావడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని భావిస్తున్నారు. వేల సంఖ్యలో రోగులు ఉండే గాంధీ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు జరగడంతో భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:Radisson Pub: అభిషేక్‌కు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్లు గుర్తింపు

ABOUT THE AUTHOR

...view details