తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరంజీవి ఫాంహౌస్​లో అగ్ని ప్రమాదం.. మంటల్లో సైరా సెట్​ ​ - చిరంజీవి ఫాంహౌలో అగ్ని ప్రమాదం.. మంటల్లో సైరా సెట్​ ​

మెగాస్టార్ చిరంజీవి ఫాంహౌస్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫాంహౌస్​లో సైరా నర్సింహారెడ్డి చిత్ర నిర్మాణం కోసం వేసిన సెట్ మంటల్లో దగ్ధమైంది.

fire accident in syeraa set

By

Published : May 3, 2019, 8:12 AM IST

Updated : May 3, 2019, 9:34 AM IST

కోకాపేటలోని నటుడు చిరంజీవి ఫాంహౌస్​లో అగ్ని ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలో సైరా చిత్రం కోసం వేసిన సెట్టింగ్​ మంటల్లో కాలిపోయింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్ల అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం కారణంగా షూటింగ్​ నిలిచిపోయింది. ఇవాళ షూటింగ్​లో పాల్గొనాల్సిన అమితాబచ్చన్​ రద్దు చేసుకున్నారు. మూడు కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

మంటల్లో సైరా సెట్​ ​
Last Updated : May 3, 2019, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details