శేషాచలం కొండల్లో మంటలు చెలరేగాయి. శేషతీర్థంకు సమీపంలోని డబ్బా రేకుల కోనలో మంటలు వ్యాపిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో మంటలు చేలరేగడంతో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. గాలి వీస్తుండడం, ఎత్తైన కొండ కావడంతో వేగంగా అగ్ని కీలలు వ్యాప్తి చెందుతున్నాయి. ఫలితంగా దట్టంగా పొగ కమ్మేసింది. మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు - fire in sheshachalam forest
ఏపీలోని శేషాచలం కొండల్లో మంటలు చెలరేగాయి. డబ్బా రేకుల కోనలో పొగ దట్టంగా కమ్మేసి, మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
శేషాచలం
ఇదీచదవండి: మూడు వారాల్లోనే ఒక శాతం పెరిగిన నిరుద్యోగ రేటు