తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్​పల్లిలోని ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం - jal[palli fire accident

ఓ ప్లాస్టిక్​ గోదాములో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన హైదరాబాద్​ శివారు జల్​పల్లిలో జరిగింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు.

fire accident in plastic scrap godown at jalpalli
జల్​పల్లిలోని ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం

By

Published : May 20, 2020, 3:18 PM IST

హైదరాబాద్‌ శివారు జల్‌పల్లిలోని ఓ ప్లాస్టిక్‌ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్లాస్టిక్‌ వస్తువులు కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.

స్థానికుల సహకారంతో అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించడం వల్ల కాలనీవాసులు భయాభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించగా.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

జల్​పల్లిలోని ప్లాస్టిక్​ గోదాంలో అగ్నిప్రమాదం

ఇవీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

ABOUT THE AUTHOR

...view details