హైదరాబాద్ ఎల్బీనగర్ షైన్ చిన్నారుల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి మృతి చెందగా... ఐదుగురు గాయపడ్డారు. అత్యవసర చికిత్స విభాగంలో మంటలు వ్యాపించి పొగలు అలుముకున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కొందరిని రక్షించారు. అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. గాయపడిని చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, ఐదుగురి పరిస్థితి విషమం - Fire accident In LBNAGAR SHINE Hospitol One Child is died
హైదరాబాద్ ఎల్బీనగర్లోని షైన్ చిన్నారుల ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురు గాయపడ్డారు.
షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం... చిన్నారి మృతి