తెలంగాణ

telangana

ETV Bharat / state

కూకట్​పల్లి వై జంక్షన్​లో అగ్నిప్రమాదం - కూకట్​పల్లిలో అగ్నిప్రమాదం

కూకట్​పల్లి వై జంక్షన్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీ ప్రదేశంలో ఉన్న చెత్తకు నిప్పు అంటుకుని పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.

కూకట్​పల్లి వైజంక్షన్​లో అగ్నిప్రమాదం
కూకట్​పల్లి వైజంక్షన్​లో అగ్నిప్రమాదం

By

Published : Mar 29, 2020, 7:38 PM IST

హైదరాబాద్​ కూకట్‌పల్లి వై జంక్షన్ దగ్గరలో గోద్రేజ్ కంపెనీకి చెందిన ఖాళీ ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనాస్థలంలో ఉన్న చెత్తతోపాటు ఎండిపోయిన గడ్డికి మంటలు అంటుకొని, చెట్లకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడి, దట్టమైన పొగ కమ్ముకుంది. వై జంక్షన్​లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, పొగను గమనించి ఘటనాస్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కూకట్​పల్లి వైజంక్షన్​లో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details