భాగ్యనగరంలోని సనత్నగర్ పీఎస్ పరిధిలోని ప్రధాన రహదారిలో ఉన్న ఓ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్లో పనిచేసే యువకులు హుటాహుటిన నీళ్లు చల్లడం వల్ల కొంత ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా మంటలను అదుపు చేశారు.
హోటల్లో అగ్నిప్రమాదం... తప్పిన ప్రాణాపాయం - Hyderabad Sanathnagar Hotel Fire Accident
హైదరాబాద్ సనత్నగర్ పీఎస్ పరిధిలోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Fire Accident
హోటల్లో నూనె వెదజల్లడంతోనే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటనలో కొంత ఆస్తి నష్టం జరగ్గా... ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. అగ్నిప్రమాదంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోటల్ యాజమాన్యానికి అగ్నిమాపక శాఖ అధికారులు జరిమానా విధించారు.
ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్