హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ రోడ్లో అగ్నిప్రమాదం జరిగింది. మల్టీబ్రాండ్ టూవీలర్ షోరూంలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో షోరూంలో ఉన్న 20 కొత్తవాహనాలు బూడిదయ్యాయి. షోరూంకు ఆనుకుని ఉన్న సర్వీసింగ్ సెంటర్‌కు మంటలు వ్యాపించడం వల్ల అందులో ఉన్న ఆరు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తంగా 26 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయని... సుమారు రూ.25 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని షోరూం యజమాని అంచనా వేస్తున్నారు.
ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం - fire accident at nagole
నాగోల్ బండ్లగూడ రోడ్‌లోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. మల్టీబ్రాండ్ టూవీలర్ షోరూమ్‌లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 26 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.25లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది.
ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం