హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పార్కులో ఉన్న చెత్తకుప్పలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
FIRE Accident: కేబీఆర్ పార్కులో అగ్నిప్రమాదం.. - హైదరాబాద్ బంజారాహిల్స్
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పార్కులో ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
కేబీఆర్ పార్కులో మంటలు
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది శకటాలతో తరలివచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో వాకర్స్ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.