Fingerprint Scam Accused Arrested In Hyderabad: సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. రోజుకో రీతిలో కొత్త పంథాలో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మోసగాళ్ల గురి.. వేలిముద్రలపై పడింది. వేలిముద్రలతో కూడిన పత్రాల్ని కొట్టేసి నకిలీలను సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు.
Fingerprint Scam Accused Arrested In Hyderabad: వేలిముద్రలు చోరీచేసి నగదు విత్ డ్రా చేస్తున్న ముఠాలోని మరో ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన రంజిత్, బెంగళూరుకు చెందిన సఫత్ ఆలంను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతేడాది డిసెంబర్లో నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి ఖాతాలో నుంచి విడతల వారీగా రూ.24వేల రూపాయలు విత్ డ్రా అయ్యాయి. అతని ప్రమేయం లేకుండా ఖాతాలో నుంచి నగదు పోవడాన్ని గుర్తించిన విశ్రాంత ఉద్యోగి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు వేలిముద్రల చోరీతో ఈ మోసం జరిగినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు అక్రంను సీఐడీ అధికారులు గతేడాది డిసెంబర్లోనే అరెస్ట్ చేశారు. రిజిస్ట్రేషన్లు, రెవన్యూ శాఖ వెబ్ సైట్ల నుంచి నిందితులు సేల్ డీడ్ పత్రాలను డౌన్ లోడ్ చేసుకొని వాటిలో ఉన్న వేలిముద్ర గుర్తులను కంప్యూటర్లలో స్కాన్ చేసినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. డాక్యుమెంట్లలో ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు సైతం సేకరించినట్లు గుర్తించారు. ఆ తర్వాత సిలికాన్ వేలిముద్రలు రూపొందించి కస్టమర్ సర్వీస్ పాయింట్ మిషన్లలో నగదు తీసుకున్నట్లు తేల్చారు. ఈ ముఠా పలుచోట్ల ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది.
Cyber Fruad: ఇదెక్కడి దొంగ తెలివిరా బాబు... సైబర్ నేరగాళ్ల కొత్త రూట్