పరిమితికి మించి వేగంగా ప్రయాణిస్తే ఆ వాహనం కెమెరాకు చిక్కకమానదు. క్షణాల్లో చలాను నమోదవుతుంది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి వాహనశ్రేణికి కూడా చలానా తప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాహనశ్రేణిలోని టీఎస్ 09కె 6666 నంబరు గల ఓ వాహనానికి నాలుగు చలాన్లు విధించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసు స్టేషన్, మాదాపూర్, టోలీచౌకి, చిక్కడపల్లి ఠాణాల పరిధుల్లో వేర్వేరు సందర్భాల్లో పరిమితికి మించిన వేగం కారణంగా చలాన్లు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కి ఓవర్ స్పీడ్ చలానాలు - cm kcr convoy
పరిమితికి మించి ప్రయాణిస్తే ఎవరికైనా చలానా తప్పదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లోని ఓ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. వేర్వేరు సందర్భాల్లో పరిమితికి మించి వేగం కారణంగా నాలుగు చలాన్లు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి వాహనశ్రేణిలోని కార్లలన్నింటికీ ఒకే నంబర్ కేటాయిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రోజు పైలట్ వాహనాలు సన్నాహక పరుగు నిర్వహిస్తున్నప్పుడు వేగం అతిక్రమించిన కారణంగా కోదాడ పోలీసు స్టేషన్ పరిధిలో చలానా పడింది. కారు నెంబర్‌ను బట్టి అతిక్రమించిన వాహనాలన్నింటికీ చలానా విధిస్తుంటారు. మిగతా మూడు చలాన్లు ఇలానే పడి ఉంటాయని భావిస్తున్నారు. అతివేగానికిగాను 1000 రూపాయల చొప్పున నాలుగు చలాన్లు, యూజర్ చార్జీలతో కలిపి 4140 రూపాయలు జరిమానా విధించారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణిని ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. పోలీస్ వాహనాలు అని తెలిసిన తరువాత అధికారులు కెమెరాల ఆధారంగా వచ్చిన అపరాధ రుసుములను తొలగించినట్టు తెలుస్తోంది.
ఇవీ చూడండి: సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడ్డది అతడే: రాములు నాయక్