హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోని వారికి బల్దియా జరిమానాలు విధిస్తోంది. మాస్కు లేకుండా కస్టమర్లను దుకాణంలోకి అనుమతించినందుకు ఓ దుకాణ యాజమాన్యానికి జరిమానా విధించింది. ఫతేనగర్లోని ఓ స్టీల్ దుకాణ యజమానికి రూ. 2 వేల చలాన్ వేసింది. ప్రజలు బయటకు వస్తే తప్పక మాస్కు ధరించాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానానే: జీహెచ్ఎంసీ - Mask fine in ghmc
తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. మళ్లీ పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కరోనా మహమ్మారి సమస్య గతంలో మాదిరి ప్రస్తుతం కూడా వెంటాడుతూనే ఉన్నా... ప్రజలు మాత్రం మాస్క్ ధరించేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాస్కు ధరించని వారిపై అధికారులు జరిమానా విధిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
![మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానానే: జీహెచ్ఎంసీ Mask Fine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11202544-257-11202544-1617015270997.jpg)
మాస్కు ఫైన్
మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తూనే ఉన్నా కొందరు ఈ సూచనలను పెడచెవిన పెడుతున్నారు. అవగాహన కల్పించటం వరకే ప్రభుత్వాల బాధ్యత. మాస్క్‌లు ధరించని వారిని శిక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలు పాటించటం సామాజిక బాధ్యత. ఇవి పాటించకపోతే... మనం ప్రమాదకారకులమవుతాం.
ఇదీ చూడండి:అపోహలు వద్దు... ప్రతి ఒక్కరూ టీకా తీసుకోండి: ప్రశాంత్ రెడ్డి
Last Updated : Mar 29, 2021, 4:49 PM IST