హైదరాబాద్‌లోని కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు చోరీ ఘటనపై రవాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 24న సెంట్రల్ బస్ స్టేషన్లో ఏపీ 11 జడ్ 6254 సంఖ్య గల బస్సు చోరీకి గురైంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ కార్యనిర్వహణ విభాగం ఈడీ రవీందర్, జీహెచ్‌జడ్ విభాగం ఈడీ వినోద్‌కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతీయ మేనేజర్లు, ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆర్టీసీ తరఫున జాతీయ రహదారుల పెట్రోలింగ్ బృందాలకు సమాచారమిచ్చినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు.
చోరీకి గురైన బస్సు ఎక్కడుందో కనుక్కోండి..? - ఆర్టీసీ బస్సు చోరీ
హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్లో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు ఎక్కడుందో గుర్తించాలని రవాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇవాళ సీపీ అంజనీకుమార్‌ను ఆదేశించారు. ఆర్టీసీ అధికారులతో సమీక్షించిన మంత్రి రాష్ట్రవ్యాప్తంగా బస్స్టేషన్లలో భద్రతా లోపాలను గుర్తించి సరిచేయాలని ఆదేశించారు.
బస్సు ఎక్కడుందో కనుక్కోండి
బస్సు ఎక్కడుందో వెంటనే గుర్తించాలని సీపీ అంజనీకుమార్‌కు ఫోన్లోనే ఆదేశాలు జారీచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్స్టేషన్లలో భద్రతా లోపాలను గుర్తించి సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: లారీ డ్రైవర్ బ్రేకేశాడు..ఆర్టీసీ డ్రైవర్ ఢీకొట్టాడు