Financial Losses to State Power Distribution Companies: విద్యుత్ సంస్థలు ట్రూఅప్ ఛార్జీల కింద బిల్లులు వసూలు చేసుకునేందుకు ఈఆర్సీకీ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్రంలో 2016 నుంచి 2023 మధ్య ఒక్కసారి మాత్రమే కరెంటు ఛార్జీలు పెంచామని మిగతా ఆరేళ్లలో పాత ఛార్జీలు వసూలు చేయడం వల్ల కరెంట్ కొనుగోలు, పంపిణీ ఖర్చులు పెరిగాయని డిస్కంలు పేర్కొన్నాయి.
దాదాపు 7 వేల 961 కోట్ల రూపాయలను ప్రభుత్వం డిస్కంలకు ఈక్విటీ రూపంలో అందజేసినట్లు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. మరో 9 వేల 236 కోట్లు ట్రైపార్ట్ ఎమ్ఓయూ ద్వారా చెల్లించగా, డిస్కంలు ఇంకా 12 వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిని రాబోయే విద్యుత్ బిల్లుల కింద వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావుకు విజ్ఞప్తి చేశాయి.