కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయంగా అందిస్తామని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం కేసీఆర్ చొరవతో తక్షణమే ఆర్థిక సాయం ప్రకటిస్తున్నామని వెల్లడించారు. సెకండ్ వేవ్ ఉద్ధృతిలో కేవలం 10 రోజుల వ్యవధిలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించిన దృష్ట్యా మీడియా అకాడమి ఈ కీలక నిర్ణయం తీసుకుందని అల్లం నారాయణ తెలిపారు.
'ఆ బాధిత కుటుంబాలు మే10లోగా ఆప్లై చేసుకోవాలి' - తెలంగాణ జర్నలిస్టుల కుటుంబాలకు సాయం
రాష్ట్రంలో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. కరోనా బాధిత జర్నలిస్టులకు మీడియా అకాడమీ చేయూతనందిస్తుందని పేర్కొన్నారు. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సాయంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. మే 10 లోగా బాధిత కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇటీవల కరోనాతో మరణించిన.. జర్నలిస్టుల కుటుంబాలు ఆర్థిక సాయం కోసం మీడియా అకాడమి కార్యాలయానికి.. మే 10లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరణ ధృవీకరణ పత్రం, అక్రిడేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల డీపీఆర్ఓలు ధృవీకరించాల్సి ఉంటుందన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సౌకర్యాలు, జర్నలిస్టులందరికీ టీకా కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా కరోనా బారిన పడిన 200 మంది జర్నలిస్టులకు ఇవాళ్టి నుంచి తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని అల్లం నారాయణ వెల్లడించారు.
ఇదీ చూడండి :క్యాబ్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: రాచకొండ సీపీ