Yasangi rythu bandhu: రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని... ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మేలో ప్రారంభించిన రైతుబంధు పథకం కింద ఇప్పటి వరకు ఏడు పంటలకు పెట్టుబడి సాయం అందింది. మొదట్లో ఎకరాకు ఏడాదికి రూ. 8 వేలు పెట్టుబడి సాయంగా అందించగా... రెండేళ్ల అనంతరం దాన్ని ఎకరాకు రూ. 10 వేలకు పెంచారు. రైతుబంధు కింద 2018-19లో రెండు పంటలకు గాను రూ. 10,488కోట్లు చెల్లింపులు చేశారు. 2019-20లో వానాకాలం, యాసంగి పంటలకు రూ. 10, 532 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఎకరాకు ఏడాదికి 10 వేల రూపాయలు పెంచాక 2020-21లో రెండు పంటల సీజన్లకు కలిపి 14 వేల 656 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
7 విడతల్లో రూ. 43,054 కోట్లకుపైగా సాయం ...
Rythu bandhu Scheme: ఈ ఏడాది వానాకాలం పంటకు సంబంధించి గరిష్ఠంగా 61,08,000 మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందింది. 1.32 కోట్లకు పైగా ఎకరాల భూమికి పెట్టుబడి సాయంగా రూ 7, 377 కోట్ల రైతులకు ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7 విడతల్లో రూ. 43,054 కోట్లకు పైగా రైతుబంధు సాయంగా అందించింది.