Rivers Connectivity: గోదావరి-కృష్ణా నదుల అనుసంధానికి సంబంధించిన అడుగులు పడబోతున్నాయి. సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్న నదుల అనుసంధానంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా ఆమె ప్రస్తావించారు. వీటిలో గోదావరి-కృష్ణ నదులకు సంబంధించి పరివాహక రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అలాగే పెన్నా నది ఆంధ్రప్రదేశ్‌లో, కావేరి పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. అయితే, పరివాహక రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదిరిన అనంతరమే ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది.
నదుల అనుసంధానంలో కెన్-బెత్వా ప్రాజెక్టు కూడా కీలకమైనది. ఈ ప్రాజెక్టుకు రూ.44,605 కోట్ల వ్యయం కానుంది. ఈ ఏడాది రూ.1400 కోట్లు కేటాయించారు. ఈ రెండు నదులు మధ్యప్రదేశ్‌లో పుట్టి ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునలో కలుస్తాయి. కెన్‌లో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో బెత్వాలో కలిపితే రెండు రాష్ట్రాల్లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుంది.
మరికొన్ని ప్రాజెక్టులు..
* దమన్‌గంగ-పింజల్, పార్-తాపి-నర్మద, గోదావరి-కృష్ణ, కృష్ణ-పెన్నా, పెన్నా-కావేరిలకు సంబంధించి డీపీఆర్‌లను సిద్ధం చేయనున్నారు. గోదావరి-కృష్ణ నదులకు సంబంధించి పరివాహక రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అలాగే పెన్నా నది ఆంధ్రప్రదేశ్‌లో, కావేరి పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. అయితే, పరివాహక రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదిరిన అనంతరమే ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది.
* ముంబయి దాహార్తిని తీర్చేందుకు.. మహారాష్ట్రలోని దమన్‌గంగ-పింజల్ లింక్ ప్రాజెక్టు ద్వారా దమన్‌గంగలోని మిగులు నీటిని పింజల్ డ్యామ్ ద్వారా ముంబయికి తరలిస్తారు.