రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు నిర్ణయించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించిన హరీశ్.. తెలంగాణ ఉద్యమంలో ప్రైవేట్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్ రావు - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
టీఎస్ ఐపాస్ ద్వారా భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించారు.
50వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం: హరీశ్ రావు
టీఎస్ ఐపాస్ ద్వారా భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న మంత్రి... ఆరున్నర సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15లక్షల ఉద్యోగావకాశాలు కల్పించామని వివరించారు.