హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు(HARISH RAO) ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికైనట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా అంగీకరించినందుకు హరీశ్‌రావుకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తానన్న మంత్రి హరీశ్‌రావు... 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న సొసైటీని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని తెలిపారు.
తన బాధ్యత మరింత పెరిగిందన్న హరీశ్ రావు... ప్రతిష్ఠాత్మక సంస్థను అందరమూ కలిసి ముందుకు తీసుకెళ్దామని కోరారు. సీఎం కేసీఆర్(CM KCR) సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామని హరీశ్‌రావు వెల్లడించారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని హరీశ్‌రావు వివరించారు.
'సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తాను. సొసైటీని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తుంది. సీఎం సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దాం. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోంది. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దాం.'