తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్​ ప్రతిపాదనలపై ప్రారంభమైన ఆర్థికశాఖ కసరత్తు - 2020-21 FINANCIAL YEAR BUDGET PLAN

2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభమైంది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ... జనవరి 7 వరకు ఆయా శాఖల కార్యదర్శులకు ఇవ్వాలని తెలిపింది. తొమ్మిదో తేదీ వరకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

FINANCE DEPARTMENT WORKING O 2020-21 FINANCIAL YEAR BUDGET PLAN
FINANCE DEPARTMENT WORKING O 2020-21 FINANCIAL YEAR BUDGET PLAN

By

Published : Dec 28, 2019, 6:04 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కోసం ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. 2019-20లో సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు వచ్చే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది.

ఆర్థికశాఖ వెబ్​సైట్ ద్వారా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. జనవరి 7 వరకు సంబంధిత శాఖల కార్యదర్శులకు ప్రతిపాదనలు ఇవ్వాలని... తొమ్మిదో తేదీ వరకు ఆర్థికశాఖకు సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details