తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2019, 6:15 AM IST

Updated : Feb 18, 2019, 10:45 AM IST

ETV Bharat / state

రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఛైర్మన్​

నేడు ఆర్థిక సంఘం ఛైర్మన్​ ఎన్​.కె.సింగ్​ రాష్ట్రానికి రానున్నారు. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వినతులు, ఆలోచనలను తెలుసుకోనున్నారు.

ఆర్థిక సంఘం పర్యటన

ఆర్థిక సంఘం పర్యటన
ఆర్థిక సంఘం పర్యటనకేంద్ర ఆర్థిక సంఘం నేటి నుంచి రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ చేయనుంది. ఆర్థిక సంఘం సభ్యుల బృందం... ఆదివారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. మేడిగడ్డ ఆనకట్ట, ఆరో ప్యాకేజీ వద్ద జరుగుతోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. జూన్ నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించిన ఆర్థిక సంఘం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం వద్ద మిషన్ భగీరథ పనులు పరిశీలించి ప్రాజెక్ట్ వివరాలు, పనుల పురోగతిని తెలుసుకున్నారు.
15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె సింగ్​తో పాటు ఇతర బృందం ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు పంచాయతీరాజ్​,అనంతరం పురపాలికఅధికారులు, మూడున్నర నుంచి నాలుగున్నర వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, ప్రతిపాదనలను ఆర్థిక సంఘానికి వివరించనున్నారు. మంగళవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలను ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ వినతులు, ఆలోచనలను తెలుసుకోనున్నారు.
Last Updated : Feb 18, 2019, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details