మూడురోజుల రాష్ట్ర పర్యటనకొచ్చిన 15 వ ఆర్థిక సంఘం సభ్యులు ఇవాళ ఉదయం నగరంలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. భాగ్యనగరానికే తలమానికమైన చార్మినార్‌ను చూసి మంత్రముగ్ధులయ్యారు. హైదరాబాదీ ఇరానీ చాయ్‌ను ఆస్వాదించారు. రూ. 36 కోట్లతో చేపడుతున్న చార్మినార్ పెడిస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ప్రణాళికలపై జీహెచ్ఎంసీ కమిషనర్ బృందానికి వివరించారు.
'హైదరాబాద్ అందాలకు ఫిదా' - చార్మినార్
15వ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లోని పలు చారిత్రక కట్టడాలను సందర్శించారు. చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పెడిస్టేరియన్ ప్రాజెక్టు, ఫలక్ నుమా ప్యాలెస్‌లను తిలకించారు.
వివరిస్తున్న దాన కిషోర్
ఫలక్‌నుమా అందాలకు ఫిదా
ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను కూడా ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించారు. ఆ కట్టడం విశిష్టతను పర్యాటక శాఖ అధికారులు వివరించారు. ఈ చారిత్రక భవనంలో సభ్యులు తేనీరు సేవించారు.