తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...

మున్సిపల్​ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో జరగనున్న పురపోరుకు 53,36,605 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

FINAL VOTERS LIST FOR MUNICIPAL ELECTIONS IN TELANGANA DISTRICT WISE
FINAL VOTERS LIST FOR MUNICIPAL ELECTIONS IN TELANGANA DISTRICT WISE

By

Published : Jan 5, 2020, 9:41 AM IST

రాష్ట్రంలో జరగనున్న పురపోరుకు ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 53,36,605 మంది కాగా... ఇందులో పురుషులు 26,71,694 మంది, మహిళలు 26,64,557 మంది, ఇతరులు 354 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6.40 లక్షల మంది ఓటర్లు ఉండగా... అత్యల్పంగా కుమురం భీం జిల్లాలో 44,946 మంది ఓటర్లు ఉన్నారు.

ముసాయిదా జాబితాలో కంటే 655 మంది ఓటర్లు మాత్రమే తగ్గడం గమనార్హం. తుది జాబితా ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన జిల్లాల వారి ఓటర్ల జాబితా సంక్షిప్తంగా...

పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...

ఇవీ చూడండి: పుర ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం నేడే..

ABOUT THE AUTHOR

...view details