పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం చదివిన వారు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ తుది విడత సీట్లు కేటాయించారు. ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్లో 9,199 సీట్లు కేటాయించారు. ఈసెట్ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 170 కాలేజీల్లో 9, 388 సీట్లు బీటెక్ ఉండగా.. 97.99 శాతం సీట్లు భర్తీ కాగా.. కేవలం 189 సీట్లు మిగిలాయి.
ఈసెట్ అభ్యర్థులకు తుది విడత సీట్లు కేటాయింపు
బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ తుది విడత సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 12లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. కళాశాలకు వెళ్లి చేరాలని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు
ఈసెట్ అభ్యర్థులకు తుది విడత సీట్లు కేటాయింపు
రాష్ట్రవ్యాప్తంగా 121 కాలేజీల్లో 1, 030 బీఫార్మసీ సీట్లు ఉండగా.. కేవలం పది మంది మాత్రమే సీట్లు పొందగా.. మిగతా 1, 020 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 12లోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. కళాశాలకు వెళ్లి చేరాలని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
ఇవీ చూడండి: 'విద్యను మాతృభాషలో ఇస్తే.. అవగాహన శక్తి పెరుగుతుంది'