Telangana Voters List 2022: రాష్ట్ర వ్యాప్తంగా 1,64,678 మంది ఓటర్లు మరణించగా జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. భారత ఎన్నికల సంఘం ఏటా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కసరత్తు పూర్తిచేసి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు మరణించలేదు. మేడ్చల్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చార్మినార్ నియోజకవర్గాల్లో ఇద్దరు చొప్పున, ముషీరాబాద్‌లో ఒకరు చనిపోయారు. కేసులు తదితర కారణాలతో మొత్తం 368 మంది ఓటు హక్కు కోల్పోయారు.
ఓటర్లు జాబితా నుంచి వారి పేర్లు తొలగింపు.. ఎందుకంటే? - తెలంగాణ ఓటర్ల జాబితా 2022
Telangana Voters List 2022: భారత ఎన్నికల సంఘం.. తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి 1,64,678 ఓటర్ల పేర్లను తొలగించింది. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో.. మరణించిన ఓటర్ల పేర్లను తొలగించి తుది జాబితాను ప్రకటించింది.
తెలంగాణ ఓటర్ల జాబితా