తెలంగాణ

telangana

ETV Bharat / state

సీతమ్మసాగర్​కు తుది పర్యావరణ అనుమతులు - దుమ్ముగూడెం

ఎట్టకేలకు సీతమ్మసాగర్​ ఆనకట్ట నిర్మాణానికి అటవీ అనుమతులతో పాటు తుది పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆనకట్ట నిర్మాణం కోసం 68.9 ఎకరాల అటవీ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Final Environmental Permits to Sitamma Sagar
సీతమ్మసాగర్​కు తుది పర్యావరణ అనుమతులు

By

Published : Jun 2, 2020, 2:31 PM IST

గోదావరి నదిపై దుమ్ముగూడెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సీతమ్మసాగర్ ఆనకట్టకు అటవీ అనుమతులతో పాటు తుది పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఆనకట్ట నిర్మాణం కోసం 68.9 ఎకరాల అటవీ భూమిని రాష్ట్ర నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీరు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మ సాగర్ పేరిట ఆనకట్ట నిర్మాణాన్ని తలపెట్టింది.

ఇందుకోసం ములుగు మండలం, ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల సేకరణ అవసరమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆ భూమిని బదలాయించింది. దీంతో పాటు ఆనకట్ట నిర్మాణానికి అవసరమైన తుది పర్యావరణ అనుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

ఇవీ చూడండి: నీటిపారుదలశాఖపై రెండో రోజు సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details