తెలంగాణ

telangana

ETV Bharat / state

ముక్కలను పడనీయవు.. నూనె రానీయవు..! - కొత్త రకం పిల్టర్​

మీకు వంటలంటే ఇష్టమా... అయితే ఈ కొత్తరకం ఫిల్టర్​ మీకోసమే.

new filter
ముక్కలను పడనీయవు... నూనె రానీయవు..!

By

Published : Apr 29, 2020, 8:45 PM IST

సాంబారు, రసం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ వాటిలో ఉండే ముక్కలు, కరివేపాకులను చూసి పిల్లలు, ఒక్కోసారి పెద్దవాళ్లు కూడా విసుక్కుంటారు. ఎంత జాగ్రత్తగా తప్పించి వేసుకున్నా అవి పడుతూనే ఉంటాయి. ఇక పులుసుల్లో నూనె కాస్త ఎక్కువైతే దాన్ని గరిటెతో తప్పించి వేస్తుంటాం. ఎంత తప్పించినా నూనె పడుతూనే ఉంటుంది.

ఇలాంటి ఇబ్బందులను తొలగిస్తాయి ఈ కొత్తరకం ఫిల్టర్‌ స్పూన్లు. చూడటానికి మామూలు స్టీలు గరిటెల్లానే ఉన్నా వీటికుండే ప్రత్యేక నిర్మాణం వల్ల ముక్కలను వడకడతాయి, నూనెను తేలికగా అడ్డుకుంటాయి. వాడుకోవడానికి, శుభ్రం చేయడానికి అనుకూలంగా ఉండే ఈ గరిటెలు బాగున్నాయి కదూ..!

ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం

ABOUT THE AUTHOR

...view details