తెలంగాణ

telangana

ETV Bharat / state

బుక్ ఫెయిర్​ను సందర్శించిన సినీ నటులు, ప్రజా ప్రతినిధులు - 33rd annual book fair in Hyderabad

హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్​లో జరుగుతున్న బుక్ ఫెయిర్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం సినీ నటులు, ప్రజా ప్రతినిధులు సందర్శించారు.

film stars and public representatives visited the book fair
బుక్ ఫెయిర్​ను సందర్శించిన సినీ నటులు, ప్రజా ప్రతినిధులు

By

Published : Dec 28, 2019, 10:29 AM IST

హైదరాబాద్​ ఎన్టీఆర్ గ్రౌండ్​లో జరుగుతున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శనకు సందర్శకుల తాకిడీ కొనసాగుతోంది. శుక్రవారం ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, బేవరేజేస్​ కార్పొరేషన్ ఛైర్మన్​ దేవి ప్రసాద్, ప్రజాప్రతినిధులు సందర్శించారు.

శాస్త్ర సాంకేతిక పరంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత రచయితలపై ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య సత్యం అన్నారు. కుందేపి రాణి ప్రసాద్ రచించిన బొటానికల్ జూ, సైన్స్ కార్నర్ పుస్తకాలను ఆచార్య సత్యం ఆవిష్కరించారు. బాలసాహిత్యంలో సైన్స్​తో కూడిన పుస్తకాలు రావడం ప్రశంసనీయమని జాతీయ బుక్ ట్రస్ట్ ప్రాంతీయ అధికారి మోహన్ అన్నారు.

బుక్ ఫెయిర్​ను సందర్శించిన సినీ నటులు, ప్రజా ప్రతినిధులు

ఇదీ చూడండి : నేటితో ముగియనున్న రాష్ట్రపతి దక్షిణాది పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details